ప్రజాశక్తి - కాకినాడరూరల్
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వారోత్సవాల్లో భాగంగా కాకినాడ వలసపాకల సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మేడే బహిరంగ సభ సిఐటియు నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు జి బేబీ రాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష బాబ్జి, ఏపి ఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర నాయకులు డి.ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజులు హాజరై మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉన్న 44 కార్మిక చట్టాలను మార్పు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు ను తీసుకురావాలని చూస్తోందన్నారు. దీనివల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పని గంటలు 8 గంటల పని విధానం నుండి 12 గంటలు పని విధానం తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు నిత్యవసర వస్తువుల ధరలను రోజురోజుకు పెంచుకుంటూ పోతోందని దీనివల్ల కార్మిక వర్గంపై తీవ్రమైన పెనుభౄరం పడుతుందన్నారు నూతన విద్యా చట్టం పేరుతో విద్యావ్యవస్థలో మార్పులను తీసుకు రావడం వల్ల పిల్లలను చదువుకు దూరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు విద్యుత్ సవరణ చట్టం పేరుతో స్మార్ట్ మీటర్లను పెట్టాలని చూస్తున్నారని ఇది ఎంత మాత్రం సహించేది లేదు అన్నారు ప్రజలపై చెత్త పన్ను భారాన్ని వేసి ప్రజల నడ్డి విరిచే పని చేస్తున్నారని అన్నారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తన భుజాల మీద వేసుకుని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తోందన్నారు. ఆ నిర్ణయాల వల్ల కార్మికులు కష్టజీవులు ఎన్ని నష్టాలు కష్టాలు పడుతున్నారో ఆలోచన చేయకుండా ముందుకు వెళ్తున్నారని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ఒకటి ఒకటిగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ జనసేన వారు కూడా కేంద్రాన్ని ప్రశ్నించకుండా కేంద్ర నిర్ణయానికి అడుగులు మడుగులోత్తే పని చేస్తున్నారని దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం విభజన హామీలు ప్రత్యేక హౌదా ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం ప్రశ్నించడం లేదన్నారు దేశమంతా ఒకే పన్ను విధానమని చెప్పి పెట్రోల్. డీజిల్‌ని జిఎస్‌టి పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే నేడు రూ.1200 వరకు ధర పెరిగిందని ఈ పెరుగుదలతో సామాన్యులు గ్యాస్ బండను కొనుక్కోవడం కోసం చాలా అష్ట కష్టాలు పడుతున్నారన్నారు సామాన్యులపై భారాలు వేసి సంపన్నులకు వరాలు ఇచ్చే నిర్ణయాలు బిజెపి ప్రభుత్వం చేస్తోందని. దేశంలో అంబానీ సంపదను పెంచడం కోసమే మోడీ పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు మానుకో వాలని కార్మిక, కష్టజీవులకు, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ద్వారా ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని హెచ్చరించారు. ప్రజలందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూ రితమైన నిర్ణయాలను గమనించి ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధపడాలని కార్మికులు కష్టజీవులు అనుకూల నిర్ణయాలు చేసే వారిని ముందుకు తీసుకు రావాలని అన్నారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ పద్మ, మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఈశ్వరి, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, పారిశ్రామిక క్లస్టర్ నాయకులు కె.సత్యనారాయణ, బాబులు, శ్రీహరి ఫ్యాబ్రికేషన్ యూని యన్ నాయకులు బివి రమణ, పంచాయతీ యూనియన్ నాయకులు గాంధీ సర్వే, టాలీ యూనియన్ నాయకులు జి.చిట్టిబాబు పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రజానాట్య మండలి కళాకారులు లోవరాజు బృందం సాంస్కతిక కార్యక్రమాలతో నిర్వహించిన నత్య రూపకంతో అలరించారు.










