- కార్మిక వర్గానికి సిఐటియు పిలుపు
- రెపరెపలాడిన అరుణ పతాకాలు
ప్రజాశక్తి- యంత్రాంగం
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం జిల్లాలో సిపిఎం, సిఐటియు నాయకులు హోరుగాలి, జోరువానలో అరుణ పతాకాలను ఆవిష్కరించి, ర్యాలీలు నిర్వహించారు.
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి
మే డే స్పూర్తితో కార్మిక హక్కులు, ప్రజా సమస్యలపై భవిష్యత్తు పోరాటాలు సాగించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి పిలుపునిచ్చారు. కాకినాడ కచేరిపేట సిఐటియు కార్యాలయం వద్ద బేబిరాణి ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం జడ్‌పి సెంటర్ మీదుగా, మసీదు సెంటర్, దేవాలయవీధి, జిజిహెచ్ మీదుగా బైకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, ఎపి ఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నవరం, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడారు. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతి రేక విధానాలపై రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఉద్యమాలకు కార్మికుల సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, నాయకులు మలకా రమణ, పి.వీరబాబు, ఎం.వెంకటరమణ, జ్యోతి, చామంతి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షుాలు నర్ల ఈశ్వరి, ఎపి ఎంఎస్‌ఆర్‌యు నగర కార్యదర్శి ఎఆర్‌సి.వర్మ, అప్పలస్వామి, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు సూరిబాబు, జిజిహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏచూరి శ్రీను, ఎల్‌ఐసి నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు. సుందరయ్య భవన్‌లో కె.వీరబాబు అధ్యక్షతన సిపిం జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో డి.శేషబాబ్జి, కెఎస్.శ్రీనివాస్, జి.బేబీరాణి, పి.వీరబాబు, కె.సత్తిరాజు, టి.రాజా, సూరిబాబు, ఎ.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పోర్ట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద సిపిఎం నాయకులు కె.వీర బాబు మేడే జెండాను ఆవిష్కరించారు. చింతపల్లి విజయ, పి.రామకృష్ణ, సిహెచ్.అజరు కుమార్, ఎవి. కృష్ణాజీరావు, శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వర్రె గిరిబాబు, పట్టణంలోని పలు సెంటర్లలో మరిడమ్మ తల్లి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తైనాల శ్రీను, నీలపాల సూరిబాబు, పాండవ గిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కరణం అప్పారావు, శ్రీనివాస్, పెద్దిరెడ్డి విష్ణు, మహాపాతిన రాంబాబు, గడిగట్ల సత్తిబాబు, దారపురెడ్డి కృష్ణ, ఎస్.శ్రీనివాస్‌లు జెండాలు ఆవిష్క రించారు. అనంతరం ప్రదర్శన నిర్వహించారు. దాడి బేబీ, నరసింహమూర్తి, కేదారి నాగు,మాగాపు నాగు, దేవా, పాపేశ్వరరావు, గంగాధర్, రవి, రాజు, అర్జున్ పాల్తొన్నారు. సామర్లకోటలో సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ప్రారంభించారు. బళ్ల మార్కెట్ సెంటర్ వద్ద బభిరంగ సభల బాలం శ్రీనివాస్‌ం, మండల ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్ మాట్లాడారు. అనంతరం స్థానిక పిఠాపురం రోడ్డులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు . జి.రాగంపేట రోడ్ లోని బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్, అంగన్‌వాడీ, బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణలు జరిగాయి. విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. సిపిఎం నాయకులు కరణం ప్రసాదరావు, బేవరేజెస్ హమాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాళం సత్యనారాయణ, వి.అప్పలరాజు, అంగన్‌వాడీ నాయకలు ఎ.అమలా వతి పాల్గొన్నారు. పిఠాపురంలో నాయకులు కె.విశ్వనాథం, కె.రాజు, కె.చిన్నా ఆధ్వర్యంలో పతాకావిష్కరణలు జరిగాయి. కె.నాగేశ్వరరావు, డాక్టర్ సూర్య నారాయణ, జి.వీరబాబు, డి.సత్యనారాయణ, అర్జునరావు, జిఎస్.భాస్కర్, ఎస్.శ్రీను,సూర్యనారాయణ, భవాని, రామలక్ష్మి, డి.గోపాలకృష్ణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు. మల్లాంలో సిపిఎం నాయకులు కె సింహాచలం జండా ఆవిష్కరించారు. రౌతుల పూడి మండలం బలరామపురంలో భవన నిర్మాణ కార్మికులు ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మిక సంఘం నాయకులు కోటిపల్లి నాగేశ్వరరావు. యాగదాసు సత్యనారాయణ. ఆకుల సత్యనారాయణ. వత్తర ప్రసాదు. పైల నాగన్న దొర. నాగు. భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. తాళ్లరేవు ఎంపిడిఒ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు ర్యాలీలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆశ వర్కర్ల యూనియన్, మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్, తదితర సంఘాలకు చెందిన టి. ఈశ్వరరావు, అదష్టదీపుడు, విప్పర్తి శ్రీనివాస్, మురాల రాజేష్, పి.కృష్ణ, నాగలక్ష్మి, అనంతలక్ష్మి, శ్రీదేవి, ఈశ్వరి బాయి, జి. సుబ్బలక్ష్మి, వళ్లు చంద్రావతి, మోర్త అనసూయ, నేరేడుమిల్లి సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. గొల్లప్రోలు సూర్యుడు చెరువు పాత ఆర్‌టిసి బస్టాండ్ సిఐటియు స్తూపం వద్ద అంగన్‌వాడీ, ఆశ, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మే డేను నిర్వహించారు. అమల ఏసమ్మ పతా కాన్ని అవిష్కరించారు. సిఐటియు జిల్లా నాయకులు కె.చిన్న, మండల నాయకులు నందీశ్వరరావు హాజరై మాట్లాడారు. నాయకులు అమల వెంకటలక్ష్మి, రాఘవ, నీలాపు ఏసమ్మ, బి.సత్యవతి, సిహెచ్‌వి.రమణ, సిహెచ్.రామారావు, ఎన్.సింహాచలం, సుజాత, మణి పాల్గొన్నారు. చేబ్రోలులో నందీశ్వరరావు కె.సత్యవతి, ఒ.సూర్యకాంతం, పి.నాగ పార్వతి, సిహెచ్.మంగ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. జగ్గంపేటలో సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐఐటియు అధ్యక్షుడు ఏసు బాబు, జిహెచ్‌బి వర్మ పథకాన్ని ఆవిష్కరించారు. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, సాయిరాం పాల్గొన్నారు. గండేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద బాలాజీ ప్రసాద్, అల్లు ప్రకాష్, ఆశా వర్కర్ల అధ్యక్షులు లలిత ఆధ్వర్యంలో మేడే వేడుకల్లో అంగన్‌వాడి వర్కర్ అధ్యక్షురాలు రాజేశ్వరి పాల్గొన్నారు. యు.కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి,వాకాతిప్ప, ఎండపల్లి, కొండవరం, మూలపేట గ్రామాలలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కెవివి సత్యనారాయణ ఎర్ర జెండాను ఆవిష్కరించారు జిల్లా రైతు సంఘం కార్యదర్శి జి.అప్పారెడ్డి, సిఐటియు మండల అధ్యక్షులు కె.నాగేశ్వర రావు, బిల్డింగ్ వర్కర్స్ కార్యదర్శి సిహెచ్ సాంబశివకుమార్, జి.శ్రీను, సిహెచ్.పద్మాకర్‌రావు, లవకుమారి పాల్గొన్నారు. ఏలేశ్వరంలో సిపిఎం అనుబంధ కార్మిక సంఘాల కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు, సిఐటియు నాయకులు పిల్లా రాంబాబు, ఆశ కార్యకర్తల నాయకురాలు గంగాభవాని, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు ఆధ్వర్యంలో మేడేవేడుకలు జరిగాయి. కాజులూరు మండలం సేదువాడ వంతెన నుంచి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కడలి రాంపండు, పి.సూర్యనారాయణ, షాజహాన్ రెడ్డి, శేషగిరిరావు అంగన్‌వాడీలు, ఆశాలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. కరపలో భవన నిర్మాణ కార్మికుల భవనం వద్ద నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా నాయకురాలు సిహెచ్ రమణి సిఐటియు జెండాను ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికులు భవనం వద్ద నక్కా సత్తిబాబు జెండా ఆవిష్కరించారు. గురజానపల్లి, గొర్రుపూడి, వాకాడలో మండల సిఐటియు నాయకుడు కె.సురేష్ ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు. ఆర్ వెంకటలక్ష్మి, వీరవేణి, నారాయ ణమ్మ, సంఘం ఉపాధ్యక్షుడు పడాల ఉమాశంకరావు, కార్యదర్శి కె.సత్తిబాబు, భవాని, పి.వరలక్ష్మి, జ్యోతి, కె.సత్య పాల్గొన్నారు.
కాకినాడ సుందరయ్య భవన్ వద్ద పతాక వందనం చేస్త్నున్న నాయకులు..... కాకినాడలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు










