
మేడే స్పూర్తితో ఉద్యమం
హక్కుల పరిరక్షణకుపోరాడాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్
- జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే దినోత్సవం.. జెండావిష్కరణలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను కాపాడుకోవడానికి మేడే స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 137వ మేడే దినోత్సవం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎర్ర జెండాలను సిపిఎం, సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. నంద్యాలలోని సిపిఎం కార్యాలయం వద్ద ఎర్ర జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8 పని గంటల కోసం ఆనాటి కార్మిక వర్గం చికాగో నగరంలో విరోచిత పోరాటం చేసి హక్కులు సాధించుకున్నారని తెలిపారు. ఆ స్పూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం మే డేను హక్కులదినంగా జరుపుకుంటుందని చెప్పారు. నేడు దేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులు ఆదాని, అంబానీలకు కట్టబెడుతుందని విమర్శించారు. మోడీ పాలనలో ప్రజలు సంతృప్తికరంగా లేరన్నారు. పెట్రోల్, డిజల్, వంట గ్యాస్ ధరలు పెంచడమే కాక నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతిస్తున్నారని ధ్వజమెత్తారు. పాఠ్యపుస్తకాలో భావితరాలకు అందించాల్సిన చరిత్రను మార్చుతూ మతోన్మాద భావాలను చొప్పించేలా బిజెపి పాలనలో సంఫ్‌ు పరివార్ శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మేడే స్పూర్తితో పాలకుల విధానాలపై ఉద్యమిద్దామని ప్రజలకు, కార్మికులను కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.నాగరాజు మాట్లాడుతూ వంద ఏళ్ల కిందట సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయడమే కాక, కార్మిక చట్టాలను కుదించి వారికి రక్షణ లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. పరిశ్రమల్లో, ప్యాక్టరీలలో కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. నాటి వీరుల త్యాగం నేటి కార్మిక, ఉద్యోగ వర్గాలకు స్ఫూర్తి కావాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు దర్శనం లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, సీనియర్ నాయకులు టి.మద్దులు, ఎం.శ్రీనివాస మూర్తి, రామరాజు, సద్దాం హుస్సేన్, సిఐటియు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట లింగం, యుటిఎఫ్ నాయకులు గోపాల్, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లక్ష్మణ్, వినీత్, మధు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులపై దాడి చేస్తుందని సిఐటియు నాయకులు ఆరోపించారు. మేడే దినోత్సవం సందర్బంగా ఎన్జీవోస్ కాలనీలోని సిపిఎం కార్యాలయం నుండి నంద్యాల ఎమ్మార్వో కార్యాలయం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సిఐటియు పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి ఏ.నాగరాజు మాట్లాడారు. సిఐటియు పట్టణ అధ్యక్షులు దర్శనం లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట లింగం, నాయకులు శ్రీనివాస మూర్తి, రామరాజు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మల, అంగన్వాడీలు, ఆశాలు, కార్మికులు పాల్గొన్నారు. ఎల్‌ఐసి కార్యాలయం వద్ద : నంద్యాలలోని ఎల్‌ఐసి కార్యాలయంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నంద్యాల బ్రాంచ్ కార్యదర్శి ఏ.రమేష్ బాబు ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షురాలు డి.హరిప్రియ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. జాయింట్ సెక్రెటరీ ఎ.వెంకటరాముడు, ట్రెజరర్ విఎస్. రవిశంకర్ శుక్ల, ఇసి మెంబర్స్ ఆర్‌ఎస్‌ఎల్ రంగారావు, ఎం.శోభారాణి, వసుంధర తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో 20 చోట్ల జెండా ఆవిష్కరణలు
నంద్యాల : అంతర్జాతీయ 137వ కార్మిక దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో 20 చోట్ల జెండావిష్కరణలు జరిగినట్లు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్ జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కోశాధికారి వెంకట లింగం తెలిపారు. గాంధీచౌక్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రజెండాను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు ఎగురవేశారు. పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కే.మహమ్మద్ గౌస్ జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, జిల్లా కార్యదర్శి పి.వెంకటలింగం, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస మూర్తి, రైల్వే స్టేషన్ చిన్న వ్యాపారుల సంఘం నాయకులు మాదాల శ్రీనివాసులు, సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు ఎస్ మస్తాన్ వలి, కార్మికులు పాల్గొన్నారు. నంద్యాల అర్బన్ : నంద్యాల పట్టణంలోని 25 సెంటర్లలో ఎఐటియుసి ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. టెక్కె మార్కెట్ యార్డ్ నుండి కార్మికులతో ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ముగించారు. ఎఐటియుసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, డి శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని నాలుగు సెంటర్లలో సిఐటియు ఆధ్వర్యంలో మండల కార్యదర్శి సుబ్బయ్య అధ్యక్షతన వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ జెండా ఆవిష్కరించారు. అలాగే సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాయలసీమ ఇంచార్జి సుబ్బారెడ్డి జెండా ఆవిష్కరించారు. అంగన్వాడీ నాయకురాలు రోజా రమణి, ఆటో యూనియన్ దస్తగిరి, భాస్కర్ ,శేఖర్, గౌడ్, ప్రసాదు, నాగేంద్ర, హమాలీ నాయకులు బషీరు, బాలరాజు, మద్దిలేటి పాల్గొన్నారు. ఆళ్లగడ్డ: నియోజకవర్గంలోని సిరివెళ్లలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండానును ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు ఆవిష్కరణ చేశారు. డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు శివ, ఆటో యూనియన్ నాయకులు జిల్లెల్ల మియా హుస్సేన్, ఆటో యూనియన్ కార్మికులు రఫీ, షాకీర్, కరీం భాష, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉయ్యాలవాడలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బాల వెంకట్ జెండాను ఆవిష్కరించారు. రమణ కుమారి, పద్మావతి, లక్ష్మీదేవి, రామసుబ్బమ్మ, వెంకటలక్ష్మి, లక్ష్మిదేవి, సుజాత పాల్గొన్నారు. ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం వద్ద, నాలుగు రోడ్ల కూడలి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జెండాను అధ్యక్షులు తాళ్ల శ్రీనివాసులు, కార్యదర్శి రమేష్ బాబులు ఆవిష్కరించారు. మున్సిపాలిటీ , ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పాణ్యం : పాణ్యంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు, కే భాస్కర్, వెంకట్, శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు బత్తిని ప్రతాప్‌లు జెండావిష్కరణ చేసి మాట్లాడారు. ఆటో, హమాలీ, గ్రామపంచాయతీ, స్వచ్ఛభారత్ కార్మికులు సుబ్బరాయుడు, నాగరాజు, బషీర్, భూపాల్, చంద్ర, శ్రీరాములు, శ్యామల దేవదానం పాల్గొన్నారు. కోవెలకుంట్ల : పట్టణంలోని స్థానిక జమ్మలమడుగు సర్కిల్‌లో భగత్ సింగ్ హమాలి యూనియన్ ఆద్యర్యంలో రాయలసీమకలా వేదిక జిల్లా కార్యదర్శి అప్పbపోగుల వెంకటసుబ్బయ్య జెండా ఎగురవేశారు. యూనియన్ గౌరవాధ్యక్షులు యగ్గొని ఓబులేసు, అధ్యక్షులు నారాయణ, ఉపాధ్యక్షులు కంబగిరి రాముడు, కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి చక్రవర్తి, రంగడు, మద్దిలేటి, యువ సమాఖ్య సభ్యులు రాంపుల్లయ్య, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










