మేడే ను జయప్రదం చేయండి : సిఐటియు
బేతంచెర్ల: ప్రపంచ కార్మికుల దినోత్సవంను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వై ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆర్ ఈశ్వరయ్య, బేతంచర్ల లారీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు కార్మికులకు కోరారు. శనివారం బేతంచెర్ల మండల కేంద్రంలోని లారీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సిఐటియు మండల సహాయ కార్యదర్శి బి. రామాంజ నేయులు అధ్యక్షతన సిఐటియు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా అనుకూల విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాడవాడలో మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని,కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దుచేసి రెగ్యులర్ చేయాలన్నారు. హమాలి,ఆటో,భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క కార్మికునికి ఐదువేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరెడ్డి, జి.నాగరాజులకు లారీ డ్రైవర్లకు,క్లీనర్‌లకు, మేడే రోజున సెలవు దినంగా ప్రకటించాలని లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. బేతంచర్ల నగర పంచాయతీలోని మున్సిపల్ కార్మికులకు మేడే రోజున సెలవు దినంగా ప్రకటించాలని సిఐటియు జిల్లా నాయకులు నగర పంచాయతీ కమిషనర్ యల్.రమేష్ బాబుకి వినతి పత్రం అందజేశారు. సమావేశంలో యూనియన్స్ నాయకులు ఎస్.రహం తుల్లా, ఎన్.కె.నాగలక్ష్మి,ఎస్.గుల్జార్ బీ,ఎస్.కె బాష, యస్. వలి,రాజు, సుబ్బయ్య,వెంకటరమణ, నాగరాజు,రాజబాబు, నరసింహుడు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు: మేడేను జయప్రదం చేయాలని సిఐటియు మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు, కార్యదర్శి చిన్న మారన్న, సహాయ కార్యదర్శి మల్లికార్జునలు కోరారు. సిఐటియు కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. హనుమంత రెడ్డి, చిన్న గంగులు పాల్గొన్నారు.










