
ప్రజాశక్తి- మునగపాక రూరల్
మేడే క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గవర్ల అనకాపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం క్రీడా పోటీలను సిఐటియు జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సిఐటియు, గవర్ల అనకాపల్లి నెహ్రూ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు మేడే క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని నాగులాపల్లి, గవర్ల అనకాపల్లి, తోటాడ, వాడ్రాపల్లి గ్రామాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 7న సాయంత్రం 5 గంటల నుండి గవర్ల అనకాపల్లి గ్రామంలో దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, నృత్య కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జెయింట్ వీల్, బాహుబలి జారుడు బల్ల, జంపింగ్ వంటి ఆటలను ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం వివిధ క్రీడా సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు ఆళ్ళ సూరిబాబు, రామలక్ష్మి, అంజలి, బేబీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.