ఎన్నో పూలు తమకు తాముగా రాలి
భావితరాలకు విత్తనాలుగా మారి
పేదరికానికి, శ్రామికత్వానికి
సారూప్యతలు తప్ప సరిహద్దులండవని
'ప్రపంచ కార్మికులారా ఏకంకండ'ని
ఎలుగెత్తి చాటిన దినం
శ్రామికత్వం, సమైక్యతత్వం, సమానత్వం
ప్రపంచ ప్రగతికి ప్రదీపికలుగా
విశ్వమానవ కార్మికతత్వమే
విశ్వమానవ సౌభ్రాతృత్వమని
పిడికిలెత్తి నినదించిన దినం
- దిలీప్.వి
8464030808