-ఆశ వర్కర్స్ యూనియన్ పిలుపు
ప్రజాశక్తి - కాకినాడ
ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం స్థానిక సిఐటియు ఆఫీసు నందు నర్ల ఈశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు జి బేబీ రాణి మాట్లాడుతూ 8 గంటల పని దినం కోసం జరిగిన కార్మిక పోరాటం మే డేగా ప్రసిద్ధి కెక్కిందని, ప్రపంచంలోనే అన్ని దేశాలలో కార్మిక వర్గం 8 గంటల పని దినాన్ని సాధించిందన్నారు. పనిగంటలే కాకుండా ఇతర హక్కులను కూడా సంపాదించిందన్నారు. నేడు కార్మిక హక్కులను నిలుపుకునేందుకు మరో పోరాటం చేయవలసిన అవసరం ఉందని, అందుకని మేడే దినోత్సవాన్ని కార్మిక హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ మాట్లాడుతూ మేడే దినోత్సవాన్ని ప్రతి గ్రామంలోనూ, ప్రతి పీహెచ్సీల దగ్గర జెండాను ఎగరవేసి మే డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆర్.నాగలక్ష్మి, అంకాడి పద్మ, ఎం ఆశాజ్యోతి, అనంతలక్ష్మి మంగారత్నం, ఉమాదేవి, గ్రేస్ పాల్గొన్నారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో మంగళవారం యూనియన్ అధ్యక్షులు పుప్పాల సావిత్రి అధ్యక్షతన పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధి అంగన్‌వాడీల సమావేశం నిర్వహించారు. మేడే వేడుకల్లో అంగన్‌వాడీలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పెద్దాపురం ప్రాజెక్టు కార్యదర్శి దాడి బేబీ అన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు యాసలపు సూర్యారావు భవనం నుండి ప్రారంభ మయ్యే ప్రదర్శనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఉమామహేశ్వరి, రమణమ్మ, చక్రవేణి, సత్యనారా యణమ్మ, మార్త పాల్గొన్నారు. ఏలేశ్వరం ప్రత్తిపాడు భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో జరిగిన సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు మే ఒకటో తేదీన జరిగే ర్యాలీలో పాల్గొనాలన్నారు. తొలుత కార్మిక సంఘం భవనం వద్ద జండా ఆవిష్కరించి అనంతరం ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నెట్ల శ్రీను, సిఐటియు నాయకులు బి.సురేష్, పి.రాంబాబు సిహెచ్ వెంకటలక్ష్మి పి వరలక్ష్మి, కె.పార్వతి పి.రమణ పాల్గొన్నారు.
మేడే కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న బేబీ రాణి, ఆశావర్కర్లు










