ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ ప్రపంచ ప్రపంచ స్ట్రోక్ డే దినోత్సవం సందర్భంగా అచ్చంపేటలోని మెడికవర్ ఆసుపత్రిలో సమగ్ర స్ట్రోక్ సెంటర్‌ను ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమగ్ర స్ట్రోక్ సెంటర్‌ను ఏర్పాటు చేసినందున, ఇక్కడ రోగులు పెద్ద మెదడు దెబ్బతినకుండా సమర్థవంతమైన సంరక్షణను పొందవచ్చని చెప్పారు. అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్సను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మెడివకర్ ఆసుపత్రి హెడ్ కె.సిద్దారెెడ్డి మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్‌లో స్ట్రోక్ టీమ్‌లో న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ హెడ్, శిక్షణ పొందిన నర్సింగ్ స్టాఫ్ ఉన్నారని తెలిపారు. ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ డి.కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన మొదటి గంట అంటే 60 నిమిషాల్లో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందేలా చేస్తే ప్రాణాపాయం తప్పినట్టేనని చెప్పారు.










