Aug 26,2023 23:10

ప్రజశక్తి - చీరాల
రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 50శాతం సీట్లను అమ్ముకొంటు విద్యా వ్యాపారం చేస్తుందని, బహుజన కులాలకు చాలా నష్టమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి అన్నారు. ఈ ప్రభుత్వంలో దళితులపై దాడులు, అత్యాచారాలు ఎక్కువైనాయని అన్నారు. బహుజనుల ఓట్లతో సిఎం అయిన జగన్ మోహన్ రెడ్డి అన్యాయం చేశారన్నారు. ఎస్సి, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్ లేకుండ చేశారని అన్నారు. అధికారం లేని పదవుల్లో బహుజనులను పరిమితం చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధివిధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మణిపూర్‌లో దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండటం శోచనీయమని అన్నారు. ఆ ఘటనలపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరెత్తకపోవడం బాధాకరమని అన్నారు. చీరాల ఐక్యనగర్‌లోని బిఎస్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్రెపాటి రవి, సిర్రా భగత్ సింగ్, దుడ్డు భాస్కరరావు, షేక్ షరీఫ్, మహేంద్ర, వంశీ, కాటి, మార్కు, దానియేలు, జగన్మోహన్, అనిల్, కోరేష్ పాల్గొన్నారు.