Oct 02,2023 21:32

మెడికల్‌ మాఫియా

 రాయచోటి ; సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏదో ఒక అనారోగ్యంతో దవా ఖానాకు వెళ్లి వైద్యులకు జ్వరం అన్న వెంటనే రక్త పరీక్ష, గల్ల పరీక్ష వంటివి చేయించుకుని రావాలంటూ సూచిస్తున్నారు. ఇలా రాయించడం వల్ల ఆ వైద్యునికి ద్వారా కొంత కమీషన్‌ కూడ వస్తుంది. ఇది ఇలా ఉంటే తీరా వైద్యం కోసం డాక్టర్‌ విలువైన మందులను రాసిచ్చి ఇది రెండు వారాలపాటు వాడా లంటూ రోగికి ఇస్తారు. జిల్లాల్లో 1,258 మందుల షాపులున్నాయి. రోగి మందుల దుకాణాలకు వెళ్తే అక్కడ మందులు ఇచ్చి మాత్రలు కత్తిరించి బిల్లు వేయకుండానే నోటి లెక్కలతో లెక్కలు వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారు ఎంత చెప్పితే అంత చెల్లించి మందులు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెల కొంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాశులు ఇవేమీ అడిగే పరిస్థితి లేదు. ఇలా చదువు రాని వారి నుండి ఇస్టారాజ్యంగా మెడికల్‌ మాఫియా పేరుతో పిస్తారాజ్యంగా మందులో రేట్లు పెంచి దోచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా అనుమతులు లేకుండా వైద్యులే సొంతంగా ే మెడికల్‌ షాపులు పెట్టుకొని ఇంట్లో వారే ఆ మెడికల్‌ షాప్‌లో పనిచేస్తూ మరి దోచుకుంటున్న వైనం కూడా ఎక్కు వగా ఉంది. మందుల షాపులో కచ్చితంగా బిఫార్మసీ చేసిన వారి సర్టిఫికెట్‌తో మందులు నిర్వహించాలి. కానీ పెత్తనం ఒకరిది అన్నట్లుగా బిఫార్మసీ పూర్తయిన మహిళ కానీ, అబ్బాయి కానీ వారి సర్టిఫికెట్లను తీసుకుని దుకాణం మందులు విక్రయాలు సాగిస్తున్నారు. మెడికల్‌ షాపులో ఇంటర్‌ ఫెయిల్‌ అయిన వారు కూడా పనిచేస్తూ డాక్టర్‌ ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌ మందులు ఇస్తున్నారు. తక్కువ జీతానికి వచ్చే వారిని దుకాణాల్లో పెట్టుకొని వారి ద్వారా వ్యాపారాలు సాగిస్తున్నారు .ముఖ్యంగా మందుల షాపులో పనిచేసే వారు కచ్చితంగా బిఎస్‌సి సమాన విద్య పూర్తి చేసిన వారిని పెట్టుకోవాలి. అంతంతో చదువుకున్న వారిని ల్యాబ్‌ టెక్నీషియన్‌ సహాయకులుగా పెట్టుకొని డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం మందుల ధరల పట్టికను కచ్చితంగా ఆయా దుకాణాలు వద్ద పొందుపరచాల్సి ఉంది. ఏ ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించిన పాపాన పోలేదు. రూపాయికి రూపాయి చొప్పున మందులమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై సేల్‌ టాక్స్‌ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. జిల్లాలో వివిధ మండల, గ్రామీణ ప్రాంతాలలో కూడా రీజనల్‌ మెడికల్‌ ప్రాక్టీస్‌ అని బోర్డు పెట్టుకొని వైద్యం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అలాంటివారు వైద్య సేవలు చేస్తూ వారే సెలైన్‌ పెట్టడం, మందులు అమ్మడం, వంటివి కూడా చేస్తున్నారు. అటువంటి వారిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఔషధ తనిఖీ అధికారులు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట కరోనా సమయంలో ప్రభుత్వ డాక్టర్లు పట్టించుకోని సమయాల్లో ఆర్‌ఎంపి వైద్యులు తాము నయం చేస్తామంటూ కరోనా బాధ్యతలు నుంచి లక్షల రూపాయలు దోచుకున్న వైనం కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పటికైనా జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మందులు షాపులపై ప్రత్యేక నిగా ఉంచి ధరల నియంత్రణకు కళ్లెం వేస్తారని స్థానికులు కోరుకుంటున్నారు. ఆర్‌ఎం వైద్యశాలలపైనా నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
జిల్లాలో మందుల షాపులలో ఎవరైనా నకిలీ మందులు విక్రయించినా ఎంఆర్‌పి కంటే కంటే అధిక రేట్లు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎంఆర్‌పి కంటే పది శాతం డిస్కౌంట్‌తో మందులు విక్రయించాలి. నాణ్యతమైన మందులు మాత్రమే అమ్మాలి. ఇంతవరకు అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అలాగే మందులు షాపులకు అనుమతులు తప్పనిసరి లేకపోతే లైసెన్సు రద్దు చేస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మందుల షాపులపై తగిన చర్య తీసుకుంటాం.
- ఎస్‌.జయరాములు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, రాయచోటి.