Apr 06,2023 01:03
మందులు పంపిణీ చేస్తున్న డిఎస్‌పి శ్రీకాంత్‌

ప్రజాశక్తి-చీరాల: పేదలకు చేయూతను అందించేందుకు చీరాల పీపుల్స్‌ ట్రామా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ కిమ్స్‌ సూపర్‌ మల్టీ స్పెషాలిటీ నెక్స్ట్‌ జనరేషన్‌ సేవ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించి పేదలకు మందులు పంపిణీ చేయడం అభినందనీయమని డిఎస్పి శ్రీకాంత్‌ అన్నారు. బుధవారం మండలంలోని దేవాంగపురి పంచాయతీ కృపానగర్‌ ఎస్‌టి కాలనీలో నిర్వహించిన విజేత మెగా మెడికల్‌ క్యాంపులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు తమ వంతు సహకారాన్ని అందించే దిశగా క్యాంపులు నిర్వహించి వారికి చేయూతను అందించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ క్యాంపులో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మాజీ వార్డు మెంబర్‌ కొచ్చెర దేవా, కె రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్‌ సాంబశివరావు, డాక్టర్‌ ఎస్‌కే నాగూర్‌బాబు, డాక్టర్‌ సిహెచ్‌ కార్తీక్‌, డాక్టర్‌ సురేష్‌, పంచాయతీ కార్యదర్శి బాబూజీ, ఫౌండర్‌ చైర్మన్‌ నాగండ్ల శివరామకృష్ణ, కార్యదర్శి వై సుమన్‌రాజు తదితరులు వైద్య శిబిరంలో పాల్గొన్నారు.