మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైద్య ఉద్యోగులు
ప్రజాశక్తి - ఆదోని
గతంలో ఆదోని మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన డాక్టర్ రవీంద్ర రెడ్డి మృతిపై ప్రస్తుత ఆదోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేకున్ భాను, ఎంపిహెచ్‌ఎస్ బాబురాజు, డిపిఎంఒ సీతారాముడు సంతాపం తెలిపారు. శుక్రవారం ఆదోనిలోని ఆర్‌టిపిసిఆర్ ట్యాబ్‌లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోవిడ్ సమయంలో డివిజన్‌లోని వైద్య సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపి ఆయన చేసిన సేవలను కొనియాడారు. టిబి యూనిట్, లెప్రసీ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ, ఏరియా ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.










