Nov 09,2023 00:10

మధ్యాహ్న భోజనం తనిఖీ

మధ్యాహ్న భోజనం తనిఖీ
ప్రజాశక్తి -కేవిబిపురం: కేవిబి పురం మండలంలోని సదాశివపురం, ఆరే పాఠశాలలో విద్యార్థులకు అంది స్తున్న మధ్యాహ్న భోజ నాన్ని ఎంఈఓ 2 రవికుమార్‌ ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న పోషక ఆహార విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సహించేది లేదని విద్యార్థులకు రుచికరమైన పోష కాహారం అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంద న్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యను అందజేయాలని అప్పుడే వారు మంచి మార్కులు సాధించేందుకు వీలు పడుతుందని ఉపాధ్యాయులకు సూచనలు అందించారు. అనంతరం రికార్డులు పరిశీలించి పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.