ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం
కొండపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకం అమలును సోమవారం రాష్ట్ర మధ్యాహ్న భోజన పధకం పర్యవేక్షణ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో సోమవారం నుండి మారిన మధ్యాహ్న భోజన మోనూను ప్రభుత్వ నిబంధనల మేరకు అమలును పర్యవేక్షించారు. ఇందులో భాగంగా బియ్యం, గుడ్లు, చిక్కిల స్టోరేజీ పాయింట్లను పరిశీలించారు. వంట చేసే ప్రాంగణాన్ని ఎమ్‌డిఎమ్ నాణ్యతను రుచి చూసి సంతృప్తి వ్యకంచేశారు. అనంతరం విద్యార్థుల మరుగు దొడ్లను పరిశీలించారు. ఈ బృందంలో ఎమ్‌డిఎమ్ ఏడి కె వేణుగోపాల్ నందిగామ ఉపవిద్యాశాఖాధికారి బి గౌరి శంకర్ ఉన్నారు. ఇంకా డిఐఈవో రికార్డు అసిస్టెంట్ రాజు పాఠశాల ప్రాధానోపాధ్యాయులు యంవి శేషగిరిరావు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










