Aug 05,2022 23:07

వినతిపత్రం ఇస్తున్న పూర్వ విద్యార్థులు, కార్మికసంఘాలు

ప్రజాశక్తి-ఉక్కునగరం       స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయం రెండు పాఠశాలల్లో నాలుగురోజులుగా నిలిపేసిన మధ్యాహ్న భోజన సదుపాయాన్ని పునరుద్ధరించాలని పూర్వ విద్యార్థులు, ప్రజాసంఘాలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశాయి. శుక్రవారం ఉక్కు యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించారు.ఉక్కునగరం బీసీ రోడ్డులోని విశాఖ విమల విద్యాలయం పాఠశాలలో భోజన పథకాన్ని నిలిపేయడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మీడియా దృష్టికి తేగా,. సిఎస్‌ఆర్‌ విభాగం అధికారులతో మాట్లాడామని, వారు స్పందించి త్వరలోనే ఈ పథకాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు తెలిపారు పథకం నిర్వహణకు ప్రత్యేక ఖాతాలో సొమ్ము భద్రపరచాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఉక్కు కార్మిక గుర్తింపు సంఘం నాయకులు కేఎస్‌ఎన్‌.రావు, నీరుకొండ రామచంద్రరావు, సిఐటియు నాయకులు వైటి దాసు, పూర్వ విద్యార్థులు మొల్లి పెంటిరాజు, నందికి అప్పలరెడ్డి, మొల్లి రమేష్‌, గొరుసు సంతోష్‌, కోన రమణ, ఉక్కు కార్మిక నాయకులు పల్లా పెంటారావు, సుబ్బయ్య, రమణమూర్తి, సోమి నాయుడు, రాజా, మరిడయ్య, చీకటి శ్రీను, రమణయ్య, సాంబ పాల్గొన్నారు.