Aug 12,2023 00:33

భోజనాన్ని పరిశీలిస్తున్న ఎండిఎం జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలో కాగిత, చిన్న దొడ్డిగల్లులో పాఠశాలలను శుక్రవారం ఎండీఎం జిల్లా కో ఆర్డినేటర్‌ కె.శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా కాగిత ప్రాధమిక పాఠశాలను సందర్శించి మద్యాహ్న భోజనాన్ని, స్టోరేజ్‌ పాయింట్‌ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం చినదొడ్డిగల్లు హైస్కూల్‌ను సందర్శించి మద్యాహ్న భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పాఠశాలల్లో భోజనం చేసే విధంగా చూడాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పలు పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఎంఈఓ నరేష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకం పక్కాగా అమలు అయ్యే విధంగా పర్యవేక్షించాలని సూచించారు.