Jul 13,2023 22:41

మధ్యాహ్నభోజన పథకాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పుట్టపర్తి మండల పరిధిలోని పెడపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేసిన వంటలు నాణ్యత ప్రమాణాలు లోపించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతను మెరుగుపరిచి విద్యార్థులకు అనువుగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. పలు విషయాలను నిర్వాహకులకు ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ నవీన్‌ కుమార్‌, రెవెన్యూ సిబ్బందితో పాటు పెడపల్లి ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.