మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం
కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వి. ఏసురత్నం, జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గ్రేసమ్మ శకుంతల డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం (సీఐటీయూ,) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఇఓ అనురాధ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్షులు వి యేసు రత్నం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బాల వెంకట్ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గ్రేసమ్మ,శకుంతల మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు 20 రూపాయలు పెంచాలని పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలకు గురి అయితే అటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.మంచినీరు వంట సెట్లు వంట పాత్రలు గ్యాస్ ప్రభుత్వమే కల్పించాలన్నారు.సంవత్సరానికి రెండు జతల యూనిఫారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెంచడానికి పిల్లల వృశ్చికమైన పౌష్టిక ఆహారం అందించి పిల్లల్లో రక్తహీనత సమస్యను అధిగమించాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుందని మంచి లక్ష్యాలతో ప్రారంభించిన టువంటి ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలకు విరుద్ధంగా నీరు కారుస్తున్నాయని ఆవేదన చెందారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 45054 పాఠశాలల్లో 38 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారు ఈ పథకంలో దాదాపుగా 89 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు అనేక సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులతో ఈ ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుంది పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు పథకం అమలుకు పాఠశాలలో వంట పాత్రలు గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు నాణ్యమైన కోడిగుడ్డున సరఫరా చేయాలని పాడైపోయిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు కోరారు మధ్యాహ్నం భోజనం కార్మికులపై నేటికీ రాజకీయ వేధింపులు ఉన్నాయని వారన్నారు వేతనాలు మెనూ ఛార్జీలు కార్మికులకు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారన్నారు ఈ పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని ఉద్దేశంతో వైయస్సార్ ప్రభుత్వం ఉందని ఇది తీవ్రమైన అన్యాయమని వారన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతినెల 5వ తేదీలోపు వేతనాలు బిల్లులు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాణ్యం మండల సిఐటియు కార్యదర్శి భాస్కర్ సిఐటియు నందికొట్కూరు పట్టణ కార్యదర్శి జయరాన్ని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు మేరీ ప్రీతి సంతోషి సుమలత చిన్నమ్మ శకుంతల లక్ష్మీదేవి విమలమ్మ సుందరమ్మ మద్దమ్మ రవణమ్మ చంద్రకళ జైలు జై నబి శంషాద్ ముబారక్ బి వివిధ మండలాల మధ్య హ్నం భోజన కార్మికులు పాల్గొన్నారు.










