మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంపిడిఒ, ఎంఇఒ
గుమ్మలక్ష్మీపురం: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతి పాఠశాలలో సక్రమంగా అమలు చేయాలని ఎంపిడిఒ సాల్మన్ రాజు, ఎంఇఒ చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం వనకాబడిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని అనంతరం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆహ్లాదకరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ఎం.రాజేంద్ర, సి ఆర్ పి చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.శంకర్రావు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










