Sep 04,2023 21:58

     పోలవరం : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఎఒ సిహెచ్‌ శ్రీనివాసుబాబులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్‌ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మదర్స్‌ కమిటీ సభ్యులు, ఎంఇఒ, హెచ్‌ఎం, టీచర్స్‌ పాల్గొన్నారు.