Jul 12,2023 23:55

పల్నాడు జిల్లా: ఇరవై నుండి మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని తదితర సమస్యలు పరిష్కారం కోసం డిమాండ్‌ చేస్తూ ఈ నెల 31న కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాలో మధ్యాహ్నం భోజన కార్మికుఅధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మధ్యాహ్నం భోజన కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివ కుమారి అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూ ల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివ కుమారి మాట్లాడుతూ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు, పథకానికి బడ్జెట్‌ పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని సామా జిక భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని మౌలిక సదుపాయాలు మంచినీరు వంటగది వంట పాత్రలు ప్రభుత్వమే ఇవ్వాలని ఏడాదికి రెండు జతలు యూని ఫామ్‌ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ నెల 30న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో మధ్యాహ్నం భోజన కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాగిజావ తయారు చేయడానికి వంట పాత్రలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మహిళా నాయ కులు ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ: పెరుగుతున్న నిత్యావసర సరుకులు, వంట గ్యాస్‌ ధరల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా నాణ్యమైన భోజనాన్ని అందించడం కష్టతరంగా మారిందని సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు అంగలకుదురు ఆంజనేయులు, తిరుమల లక్ష్మీలు అన్నారు. మండల విద్యాశాఖ అధికారి జాఫ్రూల్లా కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు కనీస వేతనం 10వేలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ లో ఉన్న బిల్లులు జీతాలు వెంటనే చెల్లించాలని, ప్రతినెల 5వ తేదీ లోపుగా వేతనాలు అందజేయాలని అన్నారు. నాణ్యమైన బియ్యం, సరు కులు సివిల్‌ సప్లైస్‌ ద్వారా సప్లై చేయాలని కోరారు. బీమా సౌకర్యాన్ని కల్పించాలని, గుర్తింపు కార్డులు, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌.కె రంజాన్‌ బి, ఎస్‌ పద్మ, సిఐటియు నాయకులు బి వెంకటేశ్వర్లు, ఎస్‌ కె నాసర్‌ బి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.