
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలి - సీఐటీయూ
ప్రజాశక్తి - నంద్యాల
మధ్యాహ్న భోజన కార్మికుల నంద్యాల జిల్లా సమావేశం నరసింహయ్య భవనంలో సోమవారం తులసమ్మ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. యేసు రత్నం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గ్రేసమ్మ మాట్లాడుతూ 20 సంవత్సరం నుండి మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని ప్రతినెల 5వ తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో 88 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వారందరికీ ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించి పిల్లలు రక్తహీనత సమస్యను అధిగమించాలనే మంచి లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని మంచి లక్ష్యం తో ప్రారంభించిన ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీ కారుస్తున్నాయన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 45వేల54 పాఠశాలలో 38 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనము చేస్తున్నారన్నారు.ఈ పథకంలో 88 వేల మంది మధ్యాయిన భోజన కార్మికులు పనిచేస్తున్నారని, ప్రమాదాలకు గురి అయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వడం లేదని,ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నా వీరికి ఎలాంటి భీమా సౌకర్యం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని,ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని అన్నారు. మౌలిక సదుపాయాలైన మంచినీరు వంట షెడ్డు,వంట పాత్రలు, గ్యాస్ స్టవ్ ప్రభుత్వమే కల్పించాలని సంవత్సరానికి రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని రాజకీయ వేధింపులు ఆపాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 10 నెలలకే వేతనాలు చెల్లిస్తున్నారనీ 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మెస్సు చార్జీలు 20 రూపాయలు పెంచాలని,ఈ మధ్యకాలంలో అనేక రెట్లు పెరిగిన నిత్యవసర వస్తువుల అనుగుణంగా మధ్యాహ్నం భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నిత్యం చిన్న పిల్లలకు వంటలు వండి వారి యోగక్షేమాల కోసం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పని చేయాలని వారికి కనీస వేతనాలు పెంచాలని కోరారు. ఈ సమావేశంలో సుగుణ కుమారి నాగేశ్వరమ్మ తులసి పుష్పవతమ్మ శంషాద్ బేగం రాములమ్మ లక్ష్మమ్మ అమీరున్ బి కుమారి లక్ష్మీదేవి వివిధ మండలాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గోన్నారు.