రాయచోటి టౌన్ : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం ఇతర సామగ్రి డీలర్ల నుంచి స్కూల్‌కు రవాణా ఛార్జీలు లేనందున ప్రభత్వమే పాఠశాలకు సరఫరా చేయాలన్నారు. రాగిజావా పాయిసం వండినం దుకు ఎటువంటి డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో ఏజెన్సీల వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. కూరలు చేయాలన్నా ఇబ్బందులన్నాయని, ప్రతి విద్యార్థికీ మెనూ చార్జీలు రూ.8 నుండి రూ. 20 వరకు పెంచాలన్నారు. ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో విద్యాసంస్థలు మెర్జ్ చేయడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వారికి ఉఫాధి చూపించే భాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వంటపాత్రలు గ్యాస్ సరపరా ప్రభుత్వమే చేయలన్నారు. గుర్తింపు కార్డులివ్వాలన్నారు. మూడు నుంచి నాలుగు నెలల పెండింగ్ బిల్లులతో పాటు ప్రతి నెలా సకాలంలో బిల్లులు వేతనాలివ్వాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు రఫీ, అక్బర్, లక్ష్మిదేవి, రెడ్డెమ్మ, అనసూయ పాల్గొన్నారు.సమావేశంలో










