Aug 21,2023 20:38

మధ్య తరగతి ప్రజలకు వరం ఎంఐజి లేఅవుట్‌ : కలెక్టర్‌

రాయచోటి : మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఐజి లేఅవుట్లను నిర్మిస్తోందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ అన్నమయ్య పట్టణాభివద్ధి సంస్థ ఎంఐజి లేఅవుట్‌ పేస్‌-2 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్నిహొ దష్టిలో ఉంచుకొని ఎంఐజి లేఅవుట్‌లు నిర్మిస్తోందన్నారు. మండలంలోని దిగువ అబ్బవరం గ్రామంలో మొదటి విడతలో 31.07 ఎకరాలలో297 ప్లాట్లు గల ఎంఐజి లే అవుట్‌ వేశామని తెలిపారు. ఈ లేఅవుట్‌కు సంబంధించి అన్ని ప్లాట్లు విక్రయించామన్నారు. రాష్ట్రంలోని ఎంఐజి లేఅవుట్‌లో అన్ని ప్లాట్లు విక్రయించిన మొదటి అబ్బవరం ఎంఐజి లేఅవుట్‌ ఇదే కావడం విశేషమన్నారు. ప్రజల కోరిక మేరకు దిగువ అబ్బవరం ప్రాంతంలోని సర్వే నెంబర్‌ 631/13లో దాదాపు 21.34 ఎకరాలలో ఫేస్‌-2 కింద మరో లేఅవుట్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల ఔత్సాహిక నివాసితుల నుండి ప్లాట్లు కేటాయింపు కొరకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎంఐజి లేఅవుట్లు నిర్మిస్తోందన్నారు. తక్కువ రేటుకే అన్ని వసతులతో సిటీని తలపించే విధంగా లేఅవుట్‌లు నిర్మిస్తామన్నారు. చడం జరుగుతుందన్నారు. ఫేస్‌-2, ఎంఐజి లేఅవుట్‌కు సంబంధించి అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, పైప్‌ లైన్‌, రోడ్లు నిర్మాణం, గ్రీనరీ వంటి సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్‌, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎంఐజి లేఅవుట్‌ ఫేస్‌-2, బ్రోచర్‌ను ఆవిస్కరించారు.కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫార్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాష, లక్కిరెడ్డిపల్లె ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, అన్నమయ్య అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ(అనుడా) చైర్మన్‌ గురుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ నందన్‌, ప్లానింగ్‌ అధికారి శైలజ పాల్గొన్నారు.ఎంఐజి-2 లే అవుట్‌ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే