తెనాలిరూరల్: మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సినీ మాటలు రచయత బుర్రా సాయి మాధవ్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శకపురుషుని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి శనివారం, ఆదివారం ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై, నటించిన సినిమాలపై, ఆయన రాజకీయ జీవితంపై జరిగే సదస్సును కొత్తపేట పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహిం చారు. ఉత్సవాల్లో రోజుకొక కళాకారులను సన్మానించే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మాన సిక వైద్యులు, మధుర గాయకులు ఐనంపూడి శరత్ బాబును ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించి ఎన్టీఆర్ జ్ఞాపికను అంద జేశారు. 'రాజకీయాల్లో అన్నగా ఎన్టీఆర్' అనే అంశంపై వక్తలు పుల్లేటికుర్తి ఎస్ వి శ్రీనుబాబు, తన్నీరు శివశంకర్ లు ప్రసం గించారు. అనంతరం వక్తలనూ ఉత్సవ కమిటీ సభ్యులు సన్మా నిం చారు. కార్యక్రమంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, మాదాల కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జగన్, దేవిశెట్టిభాస్కర్, గుమ్మడిప్రసాద్, కంచర్ల ఏడుకొండలు, కంచర్ల నాగభూషణం, దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










