ప్రజాశక్తి - చిప్పగిరి
గతవారం రోజుల క్రితం కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తూ కర్నూలు దగ్గర యాక్సిడెంట్‌కు గురైన సీనియర్ అసిస్టెంట్ మధు స్వామిని ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడారు. చిప్పగిరి తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా మధు స్వామి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈయనతో పాటు విఆర్‌ఒ చంద్ర నాయక్ బైక్‌పై కర్నూలుకు వెళ్తూ కర్నూలు సమీపంలో డివైడర్‌ను ఢకొీట్టారని చెప్పారు. కర్నూలు నుంచి డిశ్చార్జి అయ్యి రావడంతో గుంతకల్లు పట్టణంలో మధు స్వామి గృహానికి వెళ్లి కుటుంబ సమేతంగా పరామర్శించి, ధైర్యాన్ని చెప్పినట్లు తెలిపారు. విఆర్‌ఒ చంద్ర నాయక్, మధు స్వామి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసిపి యువ నాయకులు శ్రీధర్, అసెంబ్లీ బూత్ కన్వీనర్ రాజన్న పాల్గొన్నారు.
ప్రమాదానికి గురైన మధు స్వామి ఇంటికెళ్లి పరామర్శిస్తున్న గుమ్మనూరు నారాయణ










