May 22,2023 22:11

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జన విజ్ఞానిక వేదక నాయకులు

ప్రజాశక్తి - పెద్దాపురం
ఒక్క కలం పోటుతో మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఎన్‌టిఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో జరిగిన సాహితీ స్రవంతి సభలో జన విజ్ఞాన వేదిక మద్యపాన వ్యతిరేక సబ్‌ కమిటీ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సబ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌టి రామారావు తన ప్రభుత్వ హయాంలో మద్యపాన నిషేధం అమలు చేసి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన ఆయనకు శత జయంతి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ పోస్టర్లు ద్వారా గ్రామీణ ప్రాంతాలల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తా మన్నారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జోషుల కృష్ణ బాబు, వంగలపూడి శివ, దారపురెడ్డి కృష్ణ పాల్గొన్నారు.