బాపట్ల జిల్లా : మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా ఎస్‌సి వకుల్ జిందాల్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్స్ స్పెషల్ డే డ్రైవ్‌ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యమైన కూడళ్లు, బ్లాక్ స్పాట్స్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాల వద్ద హెల్మెంట్ ధరించక పోవడం వలన కలిగే అనర్థలను గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డే నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుక ుంటున్నట్లు తెలిపారు. కొందరు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభ విస్తున్నాయన్నారు. ప్రమాదాలలో మద్యం తాగి వాహనాన్ని నడిపిన వారు ఆ బైకుపై ఎక్కిన ప్రయాణికులు, బాటసారులు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలను పోగొట్టుకుంటు న్నారన్నారు. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నా మన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.










