
ప్రజాశక్తి- భోగాపురం : మండలంలోని తీరప్రాంతమైన పెద్ద కొండ్రాజుపాలెం గ్రామానికి పండుగకు వచ్చి మద్యం షాపువద్ద మంగళవారం రాత్రి జరిగిన కొట్లాటలో ఇద్దరు యువకులు కొన ఊపిరితో ఉండగా మరో యువకుడికి గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు అందించిన వివరాలు మేరకు.. పెద్ద కొండ్రాజుపాలెం పంచాయితీ గ్రామ దేవత పండుగలు జరుగుతున్నాయి. పెద్దకొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన కేశం అమ్మోరు విశాఖపట్నంలో ఉంటు పండుగకు వచ్చాడు. మద్యం కొనుగోలు చేసేందుకు సమీపంలోని తోటపల్లి మద్యం షాపుకు వెళ్లాడు. ఇంతలో విశాఖపట్నానికి చెందిన మూతుడు, ముక్కాం గ్రామానికి చెందిన నవీన్ అలియాస్ స్క్రాపడు, మైలపల్లి రాజు మరి కొంత మంది వచ్చారు. మద్యం కొనుగోలుకు వెళ్లినప్పుడు భుజం రాసుకొని వెళ్లడంతో ఇరువర్గాల మద్య కొట్లాట జరిగింది. ఇందులో మూతుడు జేబులో ఉన్న కత్తి తీసి ఆమ్మోరు కడుపు లోన శరీరం పైన ఇస్టాను సారంగా పోడిచాడు. అమ్మో రుతో వచ్చిన మారుపల్లి చినరాముడు అడ్డుపడగా మూతుడు ఆ వ్యక్తి తలపై బీరు సీసాతో బలంగా కొట్టాడు. దీంతో చినరాముడు అక్కడకక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే వారు పారిపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కె.జి.హెచ్‌కు తరలించారు. ఇందులో అమ్మోరు, చినరాముడు చావు బతుకుల మద్య ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై భోగాపురం సిఐ బి.వి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్.ఐ కృష్ణమూర్తి నిందుతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.