
ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ) : విజయవాడ నగర శివారు పాయకాపురంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నకొడుకు తండ్రిని చంపాడు. ఈ ఘటన శుక్రవారం పాయకపురం ఏవిఎస్ రెడ్డి రోడ్డులో జరిగింది. ఏవిఎస్ రోడ్డులో నివాసముంటున్న విజయ్ మద్యం మత్తులో తన తండ్రి జాన్ తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి చంపాడు. సంఘటనా స్ధలానికి నున్న గ్రామీణ పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.