బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండలంలో మద్యం అమ్మకాలు జోరుగా ఉన్నాయి. విచ్ఛల విడిగా బెల్ట్‌షాపుల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్టు షాపులు మూడు పువ్వులు.. ఆరుకాయలుగా విరాజిల్లుతున్నాయి. బెల్టు షాపులు లేవని అధికారులు చెబుతున్నా, అవి లెక్కల వరకే పరిమిత మవుతున్నాయి. నూతన ఎక్సైజ్ మద్యం పాలసీని తీసుకు వచ్చి ఎంఆర్‌పికే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వారి వ్యాపారానికి హద్దుల్లేకుండా ఉందనే విమర్శ లున్నాయి. ఎలాంటి అనుమతుల్లేకుండా ఏర్పాటైన బెల్ట్‌షాపులు వేళపాళ లేకుండా తెల్లవారుజామునుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందు బాటులో ఉంటోంది. కూలి పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుప డుతున్నారు. పనులకు వెళ్లడంలేదని పలువురు పేర్కొం టున్నారు. ఒక మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పి కంటే రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రా మాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొన సాగుతున్నాయి. హౌటళ్లు, కిరాణా షాపులు, బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడంతోపాటు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి. ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే ధార పోస్తున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా యువత మద్యా నికి ఆకర్షితు లవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజల మధ్య అల్లరులు, గొడవలు జరుగడానికి మద్యం కారణమవుతోందని చర్చలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా మద్యం నియంత్రణ చెపడతామని చెబుతున్నప్పటికీ బెల్ట్ షాపుల జోరు మాత్రం తగ్గడం లేదు. అధికారులు లాలూచీతోనే బెల్ట్ షాపులను అరికట్ట లేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. బెల్టుషాపుల నిర్వా హకులపై ఎక్సైజ్ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతన్నారు.