ఇంకొల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: ఇంకొల్లు పర్చూరు రోడ్డులోని మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మార్టూరి వెంకట ప్రశాంత్ చేతివాటం ప్రదర్శించాడు. దుకాణంలోని 42 సీసాలను ఎవరికీ తెలియకుండా బయట వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న ఇంకొల్లు ఎస్‌ఐ షేక్ నాయబ్ రసూల్ వలపన్ని ప్రశాంత్‌ను పట్టుకున్నారు. అతని నుంచి 42 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. అధిక ధరలకు ఎవరైనా మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ నాయబ్ రసూల్ హెచ్చరించారు.










