Jun 21,2023 00:49

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలు

  సత్తెనపల్లి రూరల్‌: మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్‌ చేశారు. సత్తెనపల్లి మం డలం రెంటపాళ్లకు చెందిన మహిళలు జై భీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. తహసిల్దార్‌ ఎస్‌.సురేష్‌కు వినతిపత్ర ం ఇచ్చారు. కార్యక్రమంలో జై భీమ్‌ భారత్‌ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జె.విజరు కుమార్‌, మహిళలు పాల్గొన్నారు.