ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : మద్యం విక్రయాలలో అక్రమాలు, అవకతవకలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటు సారా ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలి ంచాలన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యాన్ని అధిక ధరలు విక్రయించకుండా పర్యవేక్షిం చాలన్నారు.దుకాణాల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన సమయాన్ని పాటించేలా చూడాలన్నారు. ప్రకాశం జిల్లా నుంచి 61, గుంటూరు జిల్లా నుంచి 47 దుకాణాలు కలిసి బాపట్ల జిల్లాలో మొత్తం 108 దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17 బార్లు ఉన్నాయని చెప్పారు. స్టూవర్టుపురం, వెదుళ్ళపల్లి, బేతంపూడి, దిండి, రామానగర్, నిజాంపట్నం ప్రాంతాలలో నాటు సారా అధికంగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న వారిపై పీడీ చట్టం కింద 14 కేసులు నమోదు కావడంపై సమీక్షించారు. పిడి చట్టం కింద కేసులు కావడంతో నాటు సారా అమ్మకాలు పూర్తిగా అరికట్టినట్లు అధికారులు కలెక్టర్ దష్టికి తెచ్చారు. నాటు సారా తయారీ, విక్రయాలను పూర్తిగా అరికడుతున్నామని తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఎఎస్‌పి టి.మహేష్ బాబు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.విజయ, సెబ్ సహాయ సూపరింటెండెంట్ జి.నరసింహారావు, సిఐ సిహెచ్. శ్రీనివాసుమూర్తి ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.










