
సంహితకు స్వీట్ తినిపిస్తున్న తల్లిదండ్రులు కవిత, శ్రీనివాస్ గుప్తా
ప్రజాశక్తి-చోడవరం
చోడవరం పట్టణానికి చెందిన బోగవెల్లి సంహిత దేశంలో పేరున్న మద్రాస్, బొంబాయి ఐఐటీలకు ఒకేసారి ఎంపికైంది. అయితే ఆమె కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో బొంబాయి ఐఐటీలో చదవాలని నిర్ణయించుకుంది. సంహిత తిరుపతి ఐఐటీలో బీటెక్ పూర్తి చేసింది. ఐఐటిలకు సంహిత ఎంపిక పట్ల పట్టణంలో నిర్వహిస్తున్న ఆమె తల్లిదండ్రులు బోగవెల్లి శ్రీనివాస గుప్తా, కవితలు ఆనందం వ్యక్తం చేశారు. వీరి పెద్ద కుమార్తె సాత్విక ఫ్రాన్స్ దేశంలో సైంటిస్ట్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమె గ్రీసులో శిక్షణ పొందుతుంది. ఇద్దరు కుమార్తెలు చదువులో చక్కగా రాణించి అభివృద్ధి పథంలో నడవడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇద్దరూ ఉన్నత స్థాయిలో చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.