వృద్ధులకు చీరలు పంపిణి చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో విక్కిరాలపేట రోడ్డులోని పుచ్చలపల్లి సుందరయ్య నగర్ లో మదర్ థెరిసా జయంతి వేడుకలు శనివారం నిర్వహించడం జరిగింది.సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడారు. రోగులకు, అనాధలకు, వద్ధులకు సేవలు అందించిన మాతమూర్తి మదర్ థెరిసా అని కొనియాడారు. దాతల సహకారంతో వద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. మైత్రేష్, చరణ్ తేజ పాల్గొన్నారు.










