మదర్ థెరీసా 112వ జయంతిని శుక్రవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు థెరీసా విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మదర్ థెరీసా సేవలను స్మరించుకున్నారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రజాశక్తి విలేకర్ల యంత్రాంగం
భీమునిపట్నం : స్థానిక సాగర తీరాన ఉన్న మదర్ థెరీసా విగ్రహానికి ప్రముఖ న్యాయవాది సుధాకర్, ఏసుదాస్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మూడో వార్డులో టిడిపి ఆధ్వర్యంలో థెరిసా జయంతిలో గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర కుమార్, ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెఎస్‌ఆర్ కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ ఆధ్వర్యంలో మదర్ థెరిసాకు నివాళులర్పించారు.
తగరపువలస :ఒకటోవార్డు బంగ్లామెట్ట ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం రెడ్డిపల్లి అప్పలరాజు, ఇతర ఉపాధ్యాయులు మదర్ థెరీసా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మదర్ థెరీసా విగ్రహానికి వైఎస్ ర్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కులిడి సురేష్‌బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.సిద్ధార్థ కుమార్, వైద్యులు కనకదుర్గ, మమత, హెడ్ నర్స్ రమణమ్మ తదితరులు నివాళులర్పించారు.
గీతంలో...
విశాఖపట్నం: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం దంత వైద్య కళాశాల, ఆస్పత్రి ఆవరణలోని మదర్‌థెరిస్సా విగ్రహానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సీతారామరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గీతం దంత వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.రవిశంకర్, డాక్టర్ కెవి.ప్రభాకరరావు పాల్గొన్నారు.
పేదలకు దుస్తులు పంపిణీ
ఆనందపురం:వేములవలస కూడలిలోని ఆర్‌ఎంపి జోనల్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం, వసుధ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మదర్‌థెెరిసా విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. సంఘం జోనల్ అధ్యక్షుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. జంగం జోషి స్థానిక అధ్యక్ష కార్యదర్శులు. పి.సుధాకర్‌రెడ్డి, కెఎన్. రావు, జిల్లా కార్యదర్శి. పచ్చిపులుసు కనకారావు, రామకోటేశ్వరరావు, భీమిలి సెక్రటరీ.జిబి.రాజు,గొట్టుముక్కల రఘు పాల్గొన్నారు.










