Jul 26,2023 20:44

మదనపల్లె మార్కెట్‌లో రికార్డు స్థాయికి టమోటా ధర

మదనపల్లె రూరల్‌ : మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమోటా పంట దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్‌ పరిధిలో బుధవారం రికార్డు స్థాయిలో కిలో నాణ్యమైన టమోటా రూ.168 పలికింది. మార్కెట్‌కు రైతులు కేవలం 361 టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. మార్కెట్‌లో ఏ గ్రేడ్‌ కిలో రూ.140 నుంచి రూ.168, బి గ్రేడ్‌ రూ.118 నుంచి రూ.138 వరకు.. సగటున కిలో రూ.132 నుంచి రూ.156 వరకు పలికిందని మార్కెట్‌ యార్డు కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు. మంగళవారం రూ.140 పలికిన ధర.. ప్రస్తుతం రూ.160కి పైగా పలకడంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.
- రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన టమోటాలు
ఉపశమనం!
ఖరీఫ్‌ సాగుకు ఊతం
వరి, పత్తి, వేరుశనగ సాగుకు సానుకూలం
ప్రజాశక్తి- కడప ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్వల్ప ఉపశమనాన్ని కలిగించింది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలు నుంచి నేటి వరకు మోస్తరు వర్షపాతం నమోదుకాని సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుం దనే వాతావరణశాఖ హెచ్చరికల ప్రభావం ఫలించింది. జిల్లాలో మూడ్రో జులుగా మేఘం ఉరుముతోంది. కానీ ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. తాజాగా ఆశాజనకంగా వర్షపాతం నమోదు కావడం స్వల్ప ఉపశమనాన్ని కలిగిం చింది. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు ఊపందుకోనుంది. సు మారు 4.53 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు సానుకూల వాతావరణం ఏర్ప డింది. 12 డివిజన్ల పరిధిలో ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పత్తి, మిను ములు, సోయామీన్‌ తదితర పంటలను పెద్దఎత్తున సాగు ఊపందుకోనుంది.
చెన్నూరులో అత్యధికంగా 38.8 మి.మీ
జిల్లాలో సోమవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా చక్రాయపేటలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. లింగాల మండలంలో వానజాడ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ధాటికి కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటి నిల్వలు నిండుకున్నాయి. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే చెన్నూరులో అత్యధికంగా 38.8 మి.మీ, సిద్ధవటం 30.2, కడప 28.2 మి.మీ, ఒంటిమిట్ట 25.4 శాతం, ఖాజీపేటలో 24.8 మి.మీ, పెండ్లిమర్రిలో 4.2 మి.మీ మేర వర్షపాతం నమోదు కావడం గమనార్హం. బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షపాతం కొనసాగుతుండడం రైతాంగంలో ఆశలు రేపుతోంది.
వరి, పత్తి సాగుకు ఊతం
జిల్లాలో వరి, వేరుశనగ, పత్తి, మినుములు, సోయాబీన్‌ ప్రధాన ఆహారపు పంటలు. 2023-24 ఖరీప్‌ సీజన్‌ సాగు విస్తీర్ణంలో అత్యధిక వాటా వీటిదే. ఇం దులో వరి 83 వేల ఎకరాలు, 53 వేల ఎకరాల్లో పత్తి, మినుము, వేరుశనగ పంటలు గణనీయంగా సాగవుతోంది. వీటితోపాటు వరి, వేరుశనగ, పత్తి, సోయాబీన్‌ పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. ప్రతి ఏటా జూన్‌ ఒకటి నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారం భం కావడం తెలిసిందే. జూన్‌ మాసంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌ సాగు ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జులై మాసంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి ఖరీఫ్‌ సీజన్‌ సాగు నిర్దేశింపబడుతుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జులై నాలుగవ వారంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఆశలను రేపుతోంది. జులై మొదటి వారం నుంచి ఆశాజనకంగా వర్షపాతం నమోదు కావడంతో పంటల సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది.