Aug 10,2023 20:30

మదనపల్లె మార్కెట్‌లో భారీగా తగ్గిన టమోటా ధరలు

మదనపల్లె అర్బన్‌ : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమోటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెల 30న మార్కెట్‌ చరిత్రలోనే కిలో టమోటా అత్యధికంగా రూ.196 పలికిన సంగతి తెలిసిందే. బుధవారం వరకు అత్యధికంగా కిలో టమోటా రూ.100 వరకు ఉంది. గురువారం ఈ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఇవాళ ఎ గ్రేడ్‌ కిలో టమోటా రూ.50 నుంచి రూ.64 వరకు, బి గ్రేడ్‌ రూ.36 నుంచి రూ.48 వరకు ఉంది. సగటున కిలో టమోటా రూ.44 నుంచి రూ.60తో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు.