Jun 04,2023 01:01
పసుపు కొనుగోళ్లపై మాట్లాడుతున్న ఏవో కొర్రపాటి వెంకటకృష్ణ

ప్రజాశక్తి-అద్దంకి: మద్దతు ధరకు పసుపు కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని కలవకూరు రైతు భరోసా కేంద్రంలో ఆయన మాట్లాడారు. పసుపు సాగు చేసిన రైతులు తమ పంటను అమ్ముకోవడానికి ఆయా రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 30 క్వింటాలు కొనుగోలు చేస్తారని, క్వింటాలు ఒక్కింటికి రూ.6,850 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రంలోని సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.