May 20,2023 00:45

యార్డులో అర్జీ ఇస్తున్న రైతు సంఘం నాయకులు

దుగ్గిరాల: రైతులకు మద్దతు ధర ప్రకటించి లాభం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి ప్రసాద్‌ అన్నారు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెటింగ్‌ యాడ్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు సంవత్సరం కాలం పంట నష్టపోతే పంట మార్పిడి చేసే అవకాశం లేదు పసుపు ప్రాధాన్యతను దష్టిలో ఉంచుకొని మద్దతు ధర నివ్వాలి లేని పక్షంలో మద్దతు ధరకు రైతు అమ్ముతున్న ధ రకు మధ్యలో ఉన్న వ్యత్యాసన్ని నష్టపరిహారంగా ఇవ్వాలని కోరారు. తడిసిన రంగు మారిన పసుపు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు లేదంటే ఈనెల 24వ తేదీన రైతు భరోసా కేంద్రాల వద్ద 29వ తేదీన రాష్ట్రవ్యాప్త రైతాం గాన్ని ప్రజా సంఘాలను సమీకరించి విజయవాడ కేం ద్రంగా కలెక్టరేట్ల ముత్తిడి చేపడతామన్నారు. అనం తరం యాడ్‌ చైర్మన్‌ షేక్‌ బాజీ సెక్రటరీ ఎన్‌ శ్రీని వాసరావుకు అర్జీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు కొల్లి రంగారెడ్డి రేపల్లె మాజీ ఎమ్మెల్యే ముమ్మినేని వెం కటసుబ్బయ్య రైతు సంఘం నాయకులు జె. సాంబశివరావు, పి.శివాజీ, షేక్‌ కరీముల్లా, కె. కాశయ్య, చిన్న తిరుపతయ్య, జె. జాన్‌బాబు పాల్గొన్నారు.


పసుపు పంట బయట అమ్మవద్దు
పసుపు తీసుకురావడం వలన ధరలు పెరిగే అవ కాశం ఉందని షేక్‌ బాజీ అన్నారు శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన సమాచారంలు గత వారం రోజుల్లో పదివేల బస్తాలు విక్రయించటం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం ప్రారంభంలో 5600 నుండి 6450 రూపాయలు ఉన్న ధరలు పది రోజుల్లో 6000 నుండి 6500 వరకు పెరిగాయని ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అందువలన రైతులు పసుపు బయట వ్యాపా రస్తులకు విక్రయించవద్దు యార్డు కు తీసుకురా వాల్సిందిగా కోరారు .గత సంవత్సరం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎకరానికి 40 వేల రూపాయలు పంట నష్టం కింద రైతుల ఖాతాలలో జమ చేయడం జరి గిందని తెలిపారు.