Aug 22,2023 17:19

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   మండలంలోని గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి యాత్రికుల రద్దీ పెరిగింది. మంగళవారం ఆలయానికి అధిక సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. ఈ క్రమంలో 800 మంది యాత్రికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎ.కొండలరావు తెలిపారు. ప్రసాద అమ్మకాలు, వాహన పూజ, అన్నదాన విరాళాలు కానుకల రూపంలో రూ.1,46, 097లు ఒక్కరోజు ఆదాయం సమకూరిందన్నారు. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మాల్నీడి మోహన్‌కృష్ణ, పర్యవేక్షకులు కోరగంటి రంగారావులు సేవలందించారని తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ సరిత విజయభాస్కర్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.