Oct 24,2023 21:29

ఆదాయం రూ.3,40,967
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   మండలంలోని గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక్క రోజు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎ.కొండలరావు తెలిపారు. మంగళవారం ఆలయానికి అధిక సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కరోజు ఆదాయం వివిధ సేవల రూపేణ రూ.3,40,967 లు సమకూరినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కొండలరావు తెలిపారు. అలాగే భవానిమాల ధారణ యాత్రికులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. కుప్పలవారిపాలెంనకు చెందిన శ్రీరామ సరస్వతి భజన సమాజం వారిచే హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారని ఇఒ కొండలరావు తెలిపారు.