
జంగారెడ్డిగూడెం : మండలంలోని గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న కార్తీకమాస ఉత్సవాలను ఎటువంటి అవరోధాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్‌డిఒ కె.అద్దయ్య ప్రభుత్వశాఖ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో అద్దయ్య అధ్యక్షతన మద్ది ఆంజనేయస్వామి ఆలయ కార్తీకమాస ఉత్సవాల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాస ఉత్సవాలు ప్రారంభం నాటి నుండి ముగింపు వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా నియంత్రించాలని పోలీస్‌శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మద్ది ఆలయ ఇఒ కొండలరావు, పోలీస్ రెవెన్యూ విద్యుత్, వైద్య ఆరోగ్య, తదితర ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.