ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : స్థానిక నగర పాలక సంస్థ నూతన నగర మేయరుగా చిటికిన వెంకటేశ్వరమ్మ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 4 వ తేదిన ఆమె మేయరుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే. నగర పాలక సంస్థ మేయర్ ఛాంబర్లో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి నాగ కుసుమరాణి, మాజీ మేయర్ మోకా వేంకటేశ్వరమ్మ, మాజీ డిప్యూటీ మేయర్లు, లంక సూరిబాబు, తంటిపూడి కవిత, కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ సిబ్బంది సమక్షంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం మేయరుగా వెంకటేశ్వరమ్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన సిఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), నగర పాలక సంస్థ కార్పొరేటర్లుకు, 43 వ డివిజన్ ప్రజలకు, నగర పౌరులకు కతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం నగర అభివద్ధికి శక్తివంచన లేకుండా కషి చేస్తానని హామీ ఇచ్చారు. నగర పాలక సంస్థ అభివద్ధి పనులను శాసన సభ్యులు, ఇద్దరి డిప్యూటీ మేయర్లు, 50 మంది డివిజన్ల కార్పోరేటర్ల సహాయ సహకారాలతో పూర్తి చేయటకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పేర్ని కష్ణమూర్తి (కిట్టు), నగర వైసిపి అధ్యక్షులు షైక్ సిలార్ దాదా, 43వ డివిజన్ ఇంచార్జ్ చిటికిన నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మునిసిపల్ కమీషనర్, జి చంద్రయ్య, అసిస్టెంట్ కమీషనర్ బి జ్యోతిలక్ష్మి, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.










