ప్రజాశక్తి-రేపల్లె: ఫిబ్రవరి నెలలో జరిగిన అమరావతి నేషనల్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్‌లో మౌంట్ ఫోర్ట్ స్కూల్ విద్యార్థులు అత్యధిక ప్రతిభను కనబరిచారని ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో గణితం విభాగంలో రెండో తరగతికి చెందిన షేక్ అసియా సుల్తానా మొదటి బహుమతి, అబ్దుల్ నవాజ్ రెండో బహుమతి, సైన్స్ విభాగంలో ఎన్ హీరాలోయిస్ మొదటి బహుమతి సాధించారు. ఈ విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణా రావు చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్స్, నగదు బహుమతి అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో గెలుపొందటానికి కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ కుమార్‌కు గురుదేవోభవ జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఒలింపియాడ్ వ్యవస్థాపకులు డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.










