Aug 19,2023 20:04

సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌

మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయం : చైర్మన్‌

 

ప్రజాశక్తి-డోన్‌

వార్డులలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ అన్నారు. డోన్‌ పట్టణంలోని 22వ వార్డులో సీఎండీఎఫ్‌ గ్రాంట్స్‌తో రూ.15 లక్షల 60 వేలతో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సిసి రోడ్డు పనులను శనివారం డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సప్తశైల రాజేష్‌ మాట్లాడుతూ డోన్‌ పట్టణంలో ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూన్నామని తెలిపారు. ప్రతి వార్డులో 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించామని,కొన్ని వార్డులలో ఇప్పటికే అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తి కాని వార్డులలో ప్రస్తుతం పనులు ప్రారంభించామని వాటిని కూడా త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు కొట్రికె హరికిషన్‌, ఎస్‌ఎండి జాకీర్‌ హుస్సేన్‌,కౌన్సిలర్‌ శరత్‌,నంద్యాల జిల్లా బిసి సెల్‌ అధ్యక్షుడు పోస్ట్‌ ప్రసాద్‌,వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హనుమంతురెడ్డి,మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామి రెడ్డి, మున్సిపల్‌ డిఈ రసూల్‌,ఏఈ సురేష్‌,ఇతీష్‌ లు పాల్గొన్నారు.