సిపిఎం జిల్లా కన్వీనర్ రాజశేఖర్
ప్రజాశక్తి -కరప
కరప శివారు రామకంచి రాజు నగర్ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం కాలనీలో పర్యటించగా స్థానిక మహిళలు వారిని కలిసి కాలనీలోని సమస్యలపై వివరించారు. పంచాయతీ వాటర్ హెడ్ ట్యాంక్ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు బురదగా ఉంటోందని. పేట చివర వేసిన పబ్లిక్ కుళాయికు నీరు రాకుండా డమ్మీ వేసి ఉంచడం వలన కాలనీ ప్రజలకు నీరు అందంటం లేదని తెలిపారు. దీని వల్ల రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరప వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి నీరు రోజుకి రూ.20తో ఆర్‌ఒ ప్లాంట్ వద్ద కొనుగోలు చేస్తున్నామని మహిళలు వాపోయారు. ప్రధానంగా డ్రెయినేజీలు లేక మురుగు నీరు ఎక్కడికక్కడే నిల్వ ఉండటం వల్ల రాత్రివేళ దోమలు బాధ చాలా ఎక్కువగా ఉంటుందని స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై ఎం రాజశేఖర్ మాట్లా డుతూ కాలనీలో నీ సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా తాగునీరు ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రం చేసి సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా వచ్చేది వర్షాకాలం దోమలు అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని దష్టిలో ఉంచుకుని డ్రెయినేజీల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఆయన వెంట సిపిఎం నాయకురాలు ఎం రమణ పాల్గొన్నారు.
తమ సమస్యలను రాజశేఖర్‌కు తెలుపుతున్న మహిళలు










