Nov 19,2022 23:09

ప్రజాశక్తి-విజయవాడ 

వెలగలేరు ప్రాంతంలో జరుగుతున్న జగనన్న ఇళ్ల లే అవుట్‌లో మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులను విజయవాడ నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. వెలగలేరులో జరుగుతున్న ఇళ్ల లే అవుట్లను శనివారం పరిశీలించిన విజయవాడ నగర కమిషనర్‌, సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వెలగలేరు ప్రాంతంలో జరుగుతున్న జగనన్న ఇళ్ళ లే అవుట్‌ లో మౌలిక వసతుల పనులు వేగవంతము చేసి లబ్దిదారుల గృహ నిర్మాణాలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 24 గం.లు విద్యుత్‌ ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మంచినీటికి సంబందించి పోలవరం వాగు నుండి నీటిని తీసుకోచే విధంగా ప్లాన్‌ చేయాలని అధికారులను ఆదేశించా మన్నారు. పట్టణ ప్రాంతంలోని నిరుపేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జననన్న గృహ నిర్మాణ పథకంను ప్రవేశపెట్టి, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసిందన్నారు. లే అవుట్లో లబ్దిదారులు గహా నిర్మాణం చేపట్టేందుకు వీలుగా కనీస సౌకర్యాలైన విద్యుత్‌, తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దష్టి సారించాలని కమిషనర్‌ ఆదేశించారు.