Aug 04,2023 22:45

మాట్లాడుతున్న ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి

- ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: 
వసతి భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి అన్నారు. ఎచ్చెర్లలోని ట్రిపుల్‌ ఐటిని శుక్రవారం సందర్శించారు. యూనివర్సిటీలో తాగునీరు, పరిశుభ్రత, హాస్టల్‌ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి అనంతరం చేపట్టిన పనులపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత శాఖల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల నాణ్యతలో ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్‌ కె.మోహనకృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ అసిరినాయుడు, డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ గేదెల రవి తదితరులు పాల్గొన్నారు.